MLA రాజాసింగ్, సీఎం యోగిని చంపేస్తామని బెదిరింపు కాల్స్ కలకలం..

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-26 09:07:05.0  )
MLA రాజాసింగ్, సీఎం యోగిని చంపేస్తామని బెదిరింపు కాల్స్ కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఇదే అంశంపై రాజాసింగ్ స్పందిస్తూ.. సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాలు మాట్లాడినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా చంపేస్తామని బెదిరించినట్లు కంప్లైంట్‌లో రాజాసింగ్ పేర్కొన్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి తన ప్రతి కదలికను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి సమాచారం అందిస్తున్నాడని తెలిపారు. తాను ప్రచారానికి ఏ బుల్లెట్ వాడుతాను వంటి విషయాలు ఫోన్ చేసిన వ్యక్తికి తెలుసన్నారు. ఇక, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్ సస్పెన్షన్ వేటుకు గురి కాగా.. ఇటీవల బీజేపీ హైకమాండ్ గోషామహల్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసింది. తొలి జాబితాలో రాజాసింగ్‌ను గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed