- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KTR : ఇదేగా మీ పది నెలల పాలన? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: Revanth Reddy రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. 328 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.75.118 కోట్లు అప్పు తెచ్చుకున్నదని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.72.658 కోట్ల అప్పు తెలంగాణకు గత ప్రభుత్వాల నుంచి సంక్రమించిందని Congress కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR బుధవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. నమ్మి నానబొస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఉంది రేవంత్ రెడ్డి పాలన అని తీవ్ర విమర్శలు చేశారు.
60ఏళ్ల సమైక్య పాలకుల కన్నా పది నెలల్లోనే అధిక రుణం.. ఎవరి కోసం? అని ప్రశ్నించారు. పదేళ్లలో సాధించిన ప్రగతి కన్నా పది నెలలో ఏం సాధించిండ్రని ఈ అప్పులు? అని నిలదీశారు. మీ ఆరు గ్యారంటీలు అర్థ గ్యారంటీలుగా మిగిలి పోయాయని, అప్పులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. Congress Govt రేవంత్ సర్కార్ కట్టింది కన్నా కూల్చిందే ఎక్కువ అని ఇచ్చింది కన్నా లాక్కన్నదే ఎక్కువ అని ఆరోపించారు. అర్థం లేని అప్పులు.. ఎక్కే దిగే ఢిల్లీ ఫైట్లు, ఆదాని ముందు పొర్లు దండాలు, ఇదేనా మీ పది నెలల పాలన? అంటూ ప్రశ్నించారు. పటిష్టమైన బంగారు రాష్ట్రాన్ని "చేతి"కి అందిస్తే.. భ్రష్టు పట్టిస్తున్నరని ఫైర్ అయ్యారు.