మూసీ నిర్వాసితులు ఖాళీ చేయని కారణమిదే!

by M.Rajitha |
మూసీ నిర్వాసితులు ఖాళీ చేయని కారణమిదే!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ(Musi) సుందరీకరణ పనుల్లో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో పాటు, నష్టపరిహారాన్ని కూడా అందిస్తోంది. అంతే కాకుండా తక్షణ సహాయం కింద రూ. 25 వేల నగదును కూడా నిర్వాసితులకు ఇస్తోంది. అయినప్పటికీ మూసీ నిర్వాసితుల్లో చాలామంది వారి స్థలాలు ఖాళీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు నిర్వాసితుల అభ్యతరాలకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వీరి ప్రధాన అభ్యంతరం ఏంటంటే.. వారికి ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతానికి దూరంగా ఉండటమే. నిర్వాసితుల్లో ఎక్కువ మంది పళ్ళు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులే కావడం వలన, వెళ్ళిన చోట అనుకూల పరిస్థితులు ఉంటాయో లేదో అనే అనుమానంతోనే సగం మంది ఇళ్ళు ఖాళీ చేయడం లేదు. తాము ఖాళీ చేస్తున్న ఇళ్లకు దగ్గరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తేనే వెళ్తామని, లేదంటే ఖాళీ చేయమని తెగేసి చెబుతున్నారు. దీంతో హిమాయత్ నగర్, అంబర్ పేట్, రాజేంద్రనగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్నవారికి పిల్లిగుడిసెలు, జియాగూడ, నార్సింగి ప్రాంతాల్లో గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారు అధికారులు. కాగా మొత్తంగా చూసినట్లయితే మూసీ నిర్వాసితుల్లో ఇప్పటివరకు 40% మంది మాత్రమే ఇళ్లను ఖాళీ చేసి అధికారులకు అప్పగించగా.. మిగతా వారిని కూడా ఒప్పించే పనిలో పడ్డారు రెవెన్యూ అధికారులు.

Next Story

Most Viewed