Ram Gopal Varma: సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన ట్వీట్

by Shiva |   ( Updated:2024-10-03 05:08:43.0  )
Ram Gopal Varma: సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha)ను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేసిన అంశం పొలిటికల్ వార్‌కు దారి తీసింది. మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్స్ పెట్టడం పట్ల మంత్రి సురేఖ కూడా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అలాంటి కామెంట్స్‌ పెట్టకూడదంటూ వారించాల్సిన కేటీఆర్ (KTR) కనీసం క్షమాపణలు చేప్పకపోవడం దారుణమని ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ (KTR) విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్‌ (Phone Tapping)కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. హీరో నాగచైతన్య (Naga Chaithanya), సమంత (Samantha) విడాకులకు కారణం కేటీఆరే అని సంచలన వ్యాఖ్యలు. హీరో నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేయకూడదంటే సమంతను తన దగ్గరికి పంపాలంటూ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు.

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్‌పై తెలుగు సీనిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. తాజాగా, ఇదే అంశంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ramgopal Varma) ‘X’ (ట్విట్టర్) వేదికగా తనదైన స్టైల్లో స్పందించారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత భయంకరంగా అవమానపరిచిన కొండా సురేఖ (Konda Surekha) కామెంట్లకు తాను షాక్ అయిపోయానని అన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునేందుకు మధ్యలో ‘ది మోస్ట్ రెస్పెక్టెడ్’ నాగార్జున (Nagarjuna) ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం ఏమాత్రం భరించకూడని విషయమని అన్నారు.

కేటీఆర్ (KTR)ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్థమేంటో కనీసం ఆవిడకైనా అర్థమై ఉంటుందో లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. రఘునందన్ రావు (Raghunandan Rao) విషయంలో ఎవరో అవమానించారని, అసలు ఆ విషయంతో సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలను అవమానించడం ఏంటని ప్రశ్నించారు. 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పడం దారుణమని ఫైర్ అయ్యారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఓ డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగిన ఒక మహానటి మీద అత్యంత నీచమైన మాటలలను తీవ్రంగా ఖండించాలంటూ ఆర్జీవీ (RGV) ట్వీట్ చేశారు.

Read More : సమంత ఫోన్ ట్యాప్ అయింది నిజమా..? కాదా?.. ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి

Read More : మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

Advertisement

Next Story