- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : పేదోడి కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలు! కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకుని ఉంటూ స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేసేవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇంటితోపాటు రూ. 25 వేలు పారితోషికంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో గురువారం ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆగుతున్న గుండెలు - విడిపోతున్న కుటుంబాలు, అయినా తగ్గని సర్కార్ దాహం, కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలు.. అంటూ పేర్కొన్నారు.
‘కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి - బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయం తో పోతున్న ప్రాణాలు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూమ్ తో పాటు 25 వేల పారితోషకం అంటూ అధికారుల వెకిలి ఆఫర్లు. కోటి ఆశలతో లక్షలు-కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు 25 వేలా? ఓ సన్నాసి, అదే మీ అన్న ఇంటికి మీ మంత్రుల ఇంటికి, 25 వేలు కాదు 50 వేలు ఇస్తే కూల్చమంటారా అడుగు ఒకసారి. ఇండ్లు పోతున్నాయి అనే భయంతో ఒక బుచ్చమ్మ, ఒక కుమారన్న ప్రాణాలు పోయాయి. నీ దాన దాహానికి, నీ స్కాములకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు’ అని ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు.