- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konda Surekha : కొండా సురేఖకు టీపీసీసీ చీఫ్ ఫోన్!
దిశ, వెబ్, డెస్క్ : అక్కినేని కుటుంబంపై మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను విమర్శించబోయి.. 'నాగచైతన్య(NagaChaithanya) - సమంత(Samantha) విడాకులు వంద శాతం కేటీఆర్ కారణంగా జరిగాయని.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చొద్దంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని, కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను ఆయన వద్దకు వెళ్లాలని నాగార్జున ఫ్యామిలీ ఒత్తిడి చేయగా.. సమంత నిరాకరించడంతో.. తాము చెప్పింది వినకపోతే ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారంటూ..' సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నెత్తికి చుట్టుకోకముందే రాష్ట్ర అధినాయకత్వం దిద్దుబాటు చర్యల్లోకి దిగినట్టు తెలుస్తోంది. నాగ చైతన్య, సమంతలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ(PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మహేష్ కుమార్ గౌడ్ సురేఖకు ఫోన్ చేసినట్లు సమాచారం. తక్షణమే ఈ వివాదంపై పూర్తి వివరణ ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగేలా మాత్రం కనిపించడం లేదు. ఇది ఇంకా ఎన్ని రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి.