- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఘాటు స్పందన
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇక మంత్రి అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఘాటుగా స్పందించారు. సినీ ప్రముఖుల మీద చేసే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు.
“సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా మరియు మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. రాజకీయ పార్టీలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా మహిళల వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈయన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.