సమంత ఫోన్ ట్యాప్ అయింది నిజమా..? కాదా?.. ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి

by Kavitha |   ( Updated:2024-10-03 05:09:42.0  )
సమంత ఫోన్ ట్యాప్ అయింది నిజమా..? కాదా?.. ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత విడాకులపై మంత్రి కొండారెడ్డి సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ సందర్భంగా గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. “దురదృష్టవశాత్తు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మీడియాకు చెందిన వ్యక్తులు పెట్టిన దారుణ వీడియోలు, పోస్టులు చూశా. తమ మైలేజీ పెంచుకోవడంతో పాటు డబ్బు, క్లిప్స్, వ్యూస్ కోసం కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానళ్లు సమంత పేరును ప్రముఖంగా ప్రస్తావించాయి. చివరికి ఏమైందంటే, నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి వీళ్లందరికీ ఆమె పేరు కావాలి. మరో మార్గం లేదు. ఒక్క విషయమైతే కచ్చితంగా చెప్పగలను. కలలో కూడా ఆమె స్థాయిని ఎవరూ అందుకోలేరు. వీళ్ల కర్మకాలిపోవాలని కోరుకోవడానికి నవరాత్రికి మించిన మంచి సమయం మరొకటి లేదు” అని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌కు కూడా సమాధానం ఇచ్చారు. ‘BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సమంత కచ్చితంగా స్పందించాలి. ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమా..? కాదా..? చెప్పండి’ అని నెటిజన్ ప్రశ్నించగా.. అందుకు చిన్మయి స్పందిస్తూ.. “ఆమె ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. చేయాల్సింది చేస్తారు. వాళ్లు ఎవరూ జవాబుదారీగా ఉండరు” అని సింగర్ ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read More : సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన ట్వీట్

Advertisement

Next Story