MLC Kavitha : ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |
MLC Kavitha : ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : ఉద్యమ సమయంలో ప్రజలు పూజించుకున్న తెలంగాణ తల్లి వద్దట..బతుకమ్మ వద్దటని..ఇదేక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి(Telangana Thalli)ని, బతుకమ్మ(Bathukamma)ను దూరం చేస్తూ కాంగ్రెస్ పాలకులు తెలంగాణ అస్థిత్వంపైన, సంస్కృతిపైన దాడి చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల పర్యటనలో భాగంగా ధరూర్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ ఎక్స్ రోడ్ వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500రూపాయలు ఇవ్వడం లేదని, వారికి సీఎం రేవంత్ రెడ్ది 30వేలు బాకీ పడ్డాడని విమర్శించారు. పింఛన్ పెంచుతామని పెంచకుండా అవ్వాతాతలను మోసం చేశాడన్నారు.

రైతుబంధు ఇవ్వడం లేదని, 24గంటల కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో, మండలిలో కాంగ్రెస్ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచి కాంగ్రెస్ లో చేరిపోయాడని, ఆయన రేపటి నుంచి అసెంబ్లీలో ఏ ముఖం మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. నియోజవర్గానికి ఏడాది నుంచి ఒక్క పైస రాలేదని, ఎందుకు కాంగ్రెస్ లోకి పోయావంటే పైసల కోసం పోయినంటున్నాడని, ప్రజలను వదిలి పైసల వెనుక పోయినోడు నాయకుడు ఎట్లా అవుతాడని విమర్శించారు. స్థానికంగా ఇక్కడున్న ఎమ్మెల్యే పార్టీ మారినప్పటికి రేపు మీలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేలవుతారన్నారు. మనకు ఎమ్మెల్యేలు అవసరం లేదని, కేసీఆర్ సైనికులుంటే మన ప్రభుత్వమే వస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed