E-car రేస్ వ్యవహారం.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..?

by Mahesh |
E-car రేస్ వ్యవహారం..  కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్(This car is racing) జరిగింది. ఈ వ్యవహారంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో రంగంలోకి ఈడీ అధికారులు(ED officials) దిగారు. ఈ రేసింగ్ కోసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే.. రూ. 55 కోట్లను అప్పటి మంత్రి కేటీఆర్(This car is racing) ఓ విదేశీ సంస్థలకు బదిలీ చేయించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని నాటి పురపాలక శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి.. అర్వింద్ కుమార్ కూడా ఈడీ అధికారుల విచారణలో తెలిపారనే వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో భారీ బాంబ్ పేలబోతుందని అనడంతో మాజీ మంత్రి కేటీఆర్(KTR) అరెస్టు(arrest)కు రంగం సిద్ధం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఈడీ అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed