వారిని వదిలే ప్రసక్తే లేదు.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-03 15:21:51.0  )
వారిని వదిలే ప్రసక్తే లేదు.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీలు తనను విమర్శి స్తున్నాయని తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. ప్రజలకు పని కొచ్చే సేవా కార్యక్రమాలు చేసి తనను విమర్శించాలని కానీ కొంత మంది కేవలం విమర్శలకే పరిమితమైపోయారంటూ ఫైర్ అయ్యారు. తనపై ఆరోపణలు చేసే నాయకుడిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇక తనపై దాడి అంశంపై అక్బరుద్దీన్ స్పందిస్తూ నిందితులను మనస్ఫూర్తిగా క్షమించానన్నారు.

ఇక తన కూతురి గురించి కూడా ఈ సందర్భంగా అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో తన కూతురు ప్రజా సేవ కోసం ప్రజల మధ్యకు రాబోతుందని చెప్పారు. తన కూతుర ప్రస్తుతం ఫారిన్‌లో బారిస్టర్ (లా) చదువుతోందని విదేశాల్లో ఈ కోర్సు చదువుతున్న హైదరాబాద్ తొలి యువతీగా తన కూతురు నిలవబోతుందన్నారు. తన కూతురు తనకన్నా ఎక్కువగా చదివిందని, తనకు కాబోయే భర్త నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడై ఉండాలన్నారు. ఇదే విషయాన్ని ఫ్యామిలీతో చెప్పానన్నారు. ఇక సీఎం కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించిన ఆయన దేశంలో ఏ పార్టీ చేయని అభివృద్ధి తెలంగాణలో సీఎం కేసీఆర్ చేశారన్నారు.

Advertisement

Next Story