- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TG Assembly: బీఆర్ఎస్, కాంగ్రెస్ బడ్జెట్ లకు ఎటువంటి తేడా లేదు: బీజేపీ ఎమ్మెల్యే శంకర్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ చేసిన పొరపాట్లను కాంగ్రెస్ పార్టీ చేస్తుందని.. విమర్శించారు. రాష్ట్రానికి అధికారికంగా రావాల్సి అన్ని నిధులను కేంద్రం అందిస్తుందని.. అనవసరంగా కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని రావాల్సిన నిధులు రాకుండా చేసుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే సూచించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ బడ్జెట్ లకు ఎటువంటి తేడా లేదని.. రెండు ప్రభుత్వాలను విలువైన భూములను అమ్మేందుకు సిద్ధం అయ్యాయని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 14 వేల కోట్లను అదనంగా సమకూరుస్తామని.. బడ్జెట్ లో పద్దు పెట్టారని.. అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అలాగే రైతు రుణమాఫీ కి సంబంధించిన 31 వేల కోట్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదని.. మిగిలిన రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పడం లేదని, మిగిలిన రైతుల రుణాల మాఫీకి కూడా నిర్దిష్ట సమయం పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ సూచించారు.