నాడు లూప్‌లైన్.. నేడు కీలక బాధ్యతలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-02 02:55:13.0  )
నాడు లూప్‌లైన్.. నేడు కీలక బాధ్యతలు
X

దిశ ,తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అంతుపట్టదనే ప్రచారం ఉంది. ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీస్తాడో, ఎవరిపై ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తారో అంచనా వేయలేమని అంటుంటారు. తాజాగా రెవెన్యూ శాఖ సెక్రటరీగా నవీన్ మిట్టల్‌ను నియమించడంపై ఐఏఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మిట్టల్ ఒకేసారి కీలకమైన మున్సిపల్ శాఖ సెక్రటరీగా నియమించారు. అప్పుడు ఆయన కంటే చాలామంది సీనియర్ అధికారులు ఉన్నా, వారికి ఛాన్స్ ఇవ్వలేదు. ఆ శాఖలో ఆయన సుమారు రెండున్నరేళ్లు పనిచేశారు. సడన్‌గా ఆయన్ను అంతగా ప్రియారిటీ లేని హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డుకు బదిలీ చేశారు.

మిస్ గైడ్ చేశారని కారణం?

ట్రాన్స్‌ఫర్ చేయడంపై అప్పట్లో పలు రకాల కథనాలు వినిపించాయి. కొన్ని విషయాల్లో ప్రగతిభవన్ వర్గాలకు నవీన్ కోపం తెప్పించారని ప్రచారం జరిగింది. దీంతో మిట్టల్ మొహం కనపించవద్దని పైనుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా సెక్రటేరియట్ నుంచి ఎడ్యుకేషన్ బోర్డుకు పంపిచారని ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ తర్వాత ఆయన చాలా సార్లు సెక్రటేరియట్‌లో పోస్టింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆయనను అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ సెక్రటరీగా నియమించారు. దీంతో నవీన్‌పై ఇంతకాలం ఉన్న కోపం తగ్గిపోయిందా అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.

Also Read...

ప్రజల్లోకి ''బడ్జెట్''.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!

Advertisement

Next Story

Most Viewed