సీతారామ ప్రాజెక్ట్ పనులు అడ్డగింత.. రైతుల ఆందోళనకు కారణమిదే..!

by Rajesh |
సీతారామ ప్రాజెక్ట్ పనులు అడ్డగింత.. రైతుల ఆందోళనకు కారణమిదే..!
X

దిశ, జూలూరుపాడు : సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జూలూరుపాడు మండలానికి అందించాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మండలంలోని వినోబా నగర్ గ్రామ సమీపంలో సీతారామ పనులను అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కలిసి జలదోపిడికి పాల్పడి గోదావరి జలాల్లో ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపించారు. రీ డిజైన్ పనులను తక్షణమే నిలుపుదల చేసి పాత డిజైన్ ప్రకారం పనులను చేపట్టి గోదావరి జలాలను జూలూరుపాడు మండలంతో పాటు భద్రాద్రి జిల్లాలోని రైతులకు అందించాలని కోరారు. ప్రభుత్వ స్పందించకుంటే మరిన్ని ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్, జాటోత్ కృష్ణ, ఎస్‌కే ఉమర్, గుండె పిన్ని వెంకటేశ్వర్లు, యాసా నరేష్, బానోత్ ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story