'ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉందని దేశమంతా తెలుసు!'

by Nagaya |   ( Updated:2022-12-14 08:25:47.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉందని దేశమంతా తెలుసు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ వార్ రూమ్ పై తెలంగాణ పోలీసులు నిర్వహించిన దాడులను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో మీడియాలో రెండు మూడు వారాల నుంచి వచ్చిన విషయాలనే ఫేస్ బుక్ లో పోస్టు చేస్తే దానిపై తెలంగాణ పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహమో అర్థం కావడం లేదన్నారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇన్వాల్వ్ మెంట్ ఉందని దేశమంతటా తెలుసని అదే విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేస్తే రాష్ట్ర పోలీసులకు ఎందుకు అభ్యంతరమో ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను మీరి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు.

Also Read...

తమిళనాడు క్రీడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన హీరో

Advertisement

Next Story

Most Viewed