- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియకు లైన్ క్లియర్ చేయండి.. టీపీయూఎస్ నేతల డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియకు లైన్ క్లియర్ చేయాలని తెలంగాణ ప్రాంతా ఉపాధ్యాయుల సంఘం(టీపీయూఎస్) నేతలు డిమాండ్ చేశారు. నారాయణగూడ కేశవ్ మెమోరియల్ లో టీపీయూఎస్ రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈసందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత రావు, నవాత్ సురేశ్ మాట్లాడుతూ.. అన్ని రకాల పెండింగ్ ఏరియర్స్ బిల్లులను తెలంగాణ సర్కార్ జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్, బదిలీ షెడ్యూల్ లో న్యాయపరమైన చిక్కులు పరిష్కరించాలన్నారు.
పీఆర్సీ కమిటీ ప్రకటించడంతో డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో, సీపీఎస్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏవీఎన్ రెడ్డిని వారు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలే తన ఎజెండా అని చెప్పారు. విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతానని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.