తప్పు అని తెలిసే.. విస్మయానికి గురిచేస్తున్న కరెప్ట్‌డ్ ఆఫీసర్ల థింకింగ్!

by Rajesh |
తప్పు అని తెలిసే.. విస్మయానికి గురిచేస్తున్న కరెప్ట్‌డ్ ఆఫీసర్ల థింకింగ్!
X

దిశ, క్రైమ్ బ్యూరో : 50 రోజులు లేదా 90 డేస్ అంతే కదా కాని అడ్డ దారిలో సంపాదించిన సోమ్ము, సోత్తు శాశ్వతం కదా.. మాపై పెట్టిన కేసులు చివరి వరకు ఉండవు అవి తేలవు. ఇది ఇటీవల పట్టుబడ్డ అవినీతి, అధికార దుర్వినియోగం చేసిన అధికారులతో పాటు కర్షప్సన్‌కు పాల్పడే ప్రతి ఆఫీసర్ ఇదే ధీమా కనపడుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాం, అమాయకులను కొల్లగొట్టిన రియల్ మోసాల కేసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు అందరూ కూడా వారు చేస్తున్న పని చట్ట విరుద్ధము, అది తప్పు అని తెలిసినా వారు ధైర్యంగా ఆ మిస్టేక్స్ చేసేశారు. దీని పరిణామాలు సమాజం, వ్యక్తిగతంగా ముప్పును తీసుకువచ్చినా వారికి మాత్రం కోట్లాది రూపాయాలను గుమ్మరించిందనేది ఓపెన్ సీక్రెట్. ఇలా ఈ చర్చ ఇప్పుడు కేసులను దర్యాప్తు చేస్తున్న డిపార్ట్ మెంట్లు, కోర్టులలో వీరికి బెయిల్ వస్తుందా రాదా అనే అంశాన్ని పరిశీలిస్తున్న న్యాయ నిపుణులు, సామాన్య ప్రజల వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇది.

ఫోన్ ట్యాపింగ్ కేసు..

ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, నిందితులైన మాజీ ఎస్ఐబీ ఛీఫ్ ప్రభాకర్ రావులు వీరంతా ఈ పోజిషన్‌లకు రావడానికి ఉన్నత విద్యాభ్యాసం చేసి పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగాలకు వచ్చారు. డబ్బులకు, పోస్టింగ్‌లకు ఆశపడి వారి పోస్టింగ్‌లను కాపాడుకుని, ఆదాయ రాబడిని నిరంతరం కొనసాగించేందుకు వారు చేస్తున్న పని ఘోరమైన తప్పు అని, అది ప్రమాదకరమని తెలిసి కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికార దుర్వినియోగం పీక్ స్టేజ్‌కు వెళ్ళి ఏకంగా న్యాయమూర్తి ఫోన్ సంభాషణాలు విన్నారనే అభియోగాలు కలకలం రేపాయి. వారికి లభించిన రాజకీయ ప్రతినిధుల అండ, సహకారం వారికి ఎవరు అడ్డు రారనే ఓవర్ కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది. అది కాస్తా సమాజానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పుగా మారింది. ఇప్పుడు వారి జైలులో ఉన్న ఈ జీవితం కొద్ది రోజులే కదా తర్వాత అన్ని మాఫ్ అవుతాయనే ధీమాలో ఉన్నారనేది స్పష్టం.

గొర్రెల స్కాం 700 కోట్లు?

ప్రభుత్వం పారదర్శకంగా ఈ స్కీమ్‌ను అర్హులైన వారికి అందేలా అన్ని చర్యలు తీసుకుంది. కానీ అధికారులు వేసిన స్కెచ్‌కు ఆన్ లైన్‌లో జరగాల్సిన తతంగాలన్ని కూడా పైసలిస్తేనే కనెక్ట్ అయ్యాయి. ఇలా చేసిన అధికారులు వారు చేస్తున్నది తప్పు, చట్ట విరుద్ధమని తెలుసు....అయినా డబ్బు ఉంటే తమకు ఏం కాదనే ధోరణీతో ఏకంగా 700 కోట్లకు గురి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పాత్ర ఉన్న అధికారులు, వారి అనుచరులు ఇలా లింక్ అయినా వారందరూ కోట్లు, లక్షలాది రూపాయాలను వెనక వేసుకున్నారు. దొరికినా కొన్ని రోజులే కదా తర్వాత అంతా క్లీన్...అనే ధైర్యం వారిని ఈ తప్పు చేయించిందడానికి అద్దం పడుతోంది.

నమోదు చేసిన కేసును మాఫ్ చేస్తామని..

పోలీసులు ఫిర్యాదు, ఆధారాలు ఉంటేనే కేసును నమోదు చేస్తారు. అలా నమోదు చేసిన కేసును క్లోజ్ చేస్తామని 3 లక్షలు డిమాండ్ చేసిన కుషాయిగూడ ఇన్స్ పెక్టర్ వీర స్వామి, ఎస్ ఐ షఫీలకు ఇలా చేయడం చట్ట విరుద్ధమని తెలుసు. అయినా డోంట్ కేర్ కేవలం డబ్బులు కావాలి అంతే.. దొరికినా కేవలం శాఖ పరమైన చర్యలు ఉంటాయి మా అంటే జైలు అంతే కదా ఉద్యోగం పోదు కదా.. అనే కాన్ఫిడెన్స్.

ముంచినోడి నుంచే లంచం..

వందలాది మంది బాధితులు న్యాయం జరుగుతుందని పోలీసులను ఆశ్రయించి కేసులు పెట్టారు. విచారించాల్సిన అధికారి వేలాది కోట్ల రూపాయలను ముంచిన సూత్రధారుడికి సంబంధించిన ఆధారాలు సేకరించి విచారణలో వాటిని నిరూపించి శిక్షలు పడేలా చేసి బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన పోలీసు అధికారి సేకరించిన ఆధారాలతో సూత్రధారుడిని భయపెట్టించి దండిగా డబ్బులు వసూలు చేసి చివరకు ఆదాయానికి మించిన కేసులో ఏసీబీకి చిక్కిన సీసీఎస్ ఏసీపీ ఉమ మహేశ్వర్ రావు ఉదంతం తెలిసిందే. దర్యాప్తులో సమయంలో అతను ఏసీబీ అధికారులకు సహకరించకుండా వ్యవహరించిన వైనం ఆ ఏం చేస్తారు....మా అంటే కొద్ది రోజులు జైలు అనంతరం తిరిగి పోస్టింగ్ ...ఇక అంతా కామన్.

ఎండ్ పడేది ఏలా..

ఇలా చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పులు చేస్తున్న ఆఫీసర్స్ ధైర్యం అందరీని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన అవినీతి సంపాదన మనల్ని కాపాడుతుందనే విశ్వాసం కలవరాన్ని రేపుతోంది. ఇలా అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయాలను సంపాదిస్తున్న అధికారులకు ఎండ్ పడాలంటే అసాధ్యం.. సాధ్యం కావాలంటే మాత్రం వీరి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో స్పీడ్ ట్రయల్ చేయాలి. వారు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వస్తున్న జీతం ప్రతి ఏడాది వారి వార్షిక నివేదికలో పోందుపర్చే ఆస్తుల పై నిరంతంర ఆడిట్ జరగాలి. దర్యాప్తు చేస్తున్న అధికారులు వారి ఇన్వెస్టిగేషన్ ను ఫైనల్ వరకు పూర్తి ఆధారాలతో నిరూపించేలా కొనసాగాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి అవినీతి, అధికార దుర్వినియోగం చేసే అధికారుల పై స్పీడ్ యాక్షన్ తీసుకోవాలి. వారి ఆస్తులతో లింక్ ఉన్న బినామీల లైఫ్ స్టైల్ పై కూడా ఆరా తీయాలి. ఇలాంటి కరప్టడ్ ఆఫీసర్స్ ను ప్రోత్సహించే పోలిటిషీయన్స్ పై కూడా తక్షణమే చర్యలు ఉంటేనే మరో అధికారి అవినీతి, అధికార దుర్వినియోగాని కి పాల్పడాలంటేనే భయపడతారని పోలీసు, న్యాయ నిపుణులు, మేధావులు, సామాన్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed