అసెంబ్లీలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్

by Satheesh |   ( Updated:2024-07-31 05:00:22.0  )
అసెంబ్లీలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉయదం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. సివిల్ కోర్టు అమైండ్మెంట్ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభ ముందుకు తీసుకురాగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (ఆర్థిక శాఖ మంత్రి కూడా) ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం ఇవాళ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. సోమవారం నాటికి బడ్జెట్‌పై చర్చతో పాటు అన్ని శాఖల పద్దులపై డిస్కషన్స్ కంప్లీట్ కావడంతో మొత్తం 40 శాఖల గ్రాంట్లు- డిమాండ్లకు సభ ఆమోదం తెలిపింది. ఇవాళ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న స్కిల్ యూనివర్శిటీ బిల్లుతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed