- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. ఇక చిటికెలో పర్మిషన్లు
నూతన భవనాలు, లేఅవుట్ల ఆమోదానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థ ‘బిల్డ్ నౌ’ అమల్లోకి తెస్తున్నది. ఇది అత్యాధునిక ప్రజాపాలన దిశగా ఒక విప్లవాత్మక అడుగు. భారతదేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూట్నీ వ్యవస్థగా నిలవనున్నది. ఈ వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. అనుమతులు, డ్రాయింగ్ స్క్రూట్నీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గించనున్నది. పనితీరులో ఇది ఒక బెంచ్ మార్క్‌గా నిలుస్తుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు, అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా, స్నేహపూర్వకంగా ఉండనున్నది.
ప్రస్తుతం అమలవుతున్న టీజీబీపాస్‌లో ఇన్‌స్టంట్ అప్రూవల్, సింగిల్ విండో వేర్వేరుగా ఉన్నాయి. కొత్త వ్యవస్థ ద్వారా ఆక్యూపెన్సీ సర్టిఫికెట్(ఓసీ), బిల్డింగ్ పర్మిషన్, లేఅవుట్ పర్మిషన్, ట్రాన్స్ ఫర్ డవలప్ మెంట్ రైట్స్(టీడీఆర్), అక్రమ నిర్మాణాలకు నోటీసుల జారీ వరకు అన్నింటికీ ఒకే అప్లికేషన్ ఉండబోతున్నది అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డ్ నౌ అప్లికేషన్ లోని ఫీచర్లు తెలుసుకుందాం. బిల్డ్ నౌ వ్యవస్థ ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నది. ఈలోగా నూతన వ్యవస్థపై ఆర్కిటెక్టులు, ప్రభుత్వ అధికారులు, మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు రాబోయే రోజుల్లోశిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. - నిరంజన్ కొప్పు
సింగిల్ ఇంటర్ ఫేస్ వ్యవస్థ
ఏదైనా భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత వ్యక్తులు పలు విభాగాలకు వెళ్లడం ఒక్కో ఫైలు పూర్తయ్యే వరకు ఆ ఆఫీసుల చుట్టూ తిరగడం పరిపాటే. కానీ, కొత్త వ్యవస్థలో ఆఫీసులు కాదు కదా.. కనీసం ఆన్ లైన్ లో మరో పోర్టల్ కూడా తెరవాల్సిన అవసరంలేదు. అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేయగల ఏకీకృత సింగిల్ విండో ఇంటర్ ఫేస్ ఇది. బహుళ అంతస్తుల భవనాలను కూడా 5 నిమిషాల్లో ప్రాసెస్ చేయగల వేగంతమైన స్క్రూట్నీ ఇంజిన్ ఈ వ్యవస్థ ప్రత్యేకత. ప్రజలు తమ భవనాలను నిర్మాణానికి ముందే వాస్తవికంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ 3డీ విజువలైజేషన్ ద్వారా చూసే అవకాశం కూడా ఉంటుంది. భవన నిబంధనలపై తక్షణం, కచ్చితమైన మార్గదర్శకాలను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించనున్నది. ప్రతి దరఖాస్తును ధ్రువీకరించి ట్రాక్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పించనున్నది.
రోజుల నుంచి నిమిషాల్లోకి
దరఖాస్తుల స్క్రూట్నీ సమయాన్ని ఈ వ్యవస్థ భారీగా తగ్గించనున్నది. ప్రస్తుత వ్యవస్థ టీజీబీపాస్‌లో 2నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుంది. కానీ నూతన వ్యవస్థలో ఐదు నిమిషాల్లోపే పరిశీలన పూర్తవుతుంది. టీజీబీపాస్ లో భవన సామర్థ్యం సహా భారీ భవన నిర్మాణాలకు ఎక్కువ సమయం తీసుకునేది. కానీ, బిల్డ్ నౌ 40 అంతస్థులు కలిగిన మూడు భవనాల నిర్మాణ దరఖాస్తుల స్క్రూటినీ రెండు నిమిషాలే పడుతుందని అధికారులు చెప్తున్నారు.
స్నేహపూర్వక సిటిజన్ పోర్టల్...
టీజీబీపాస్‌లో దరఖాస్తు, స్టేటస్ ట్రాకింగ్, ఫీజు చెల్లింపుల కోసం వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో సరైన అవగాహన లేక చాలామంది గందరగోళానికి గురయ్యేవారు. ప్రతి చిన్న విషయానికి ఆఫీసుకు వెళ్లి అధికారులను ఆయా సమస్యలపై ఆరా తీయాల్సి వచ్చేది. బిల్డ్ నౌలో ఆ పరిస్థితి వచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. ఇందులో డ్రాయింగ్ స్క్రూటినీ, దరఖాస్తు ప్రక్రియ రెండింటినీ కలిగి ఉన్న ఏకీకృత పోర్టల్ కావడంతో వినియోగదారులకు నిరాటంకమైన అనుభవాన్ని ఈ సమీకృత వ్యవస్థ అందిస్తుదని వెల్లడిస్తున్నారు. ఇక టీజీబీపాస్‌లో దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టమైన దశలతోపాటు నిబంధనలను అర్థం చేసుకోవడంలో ప్రజలు ఇబ్బందులు పడేవారు. దీనివల్ల పొరపాట్లు.. ఆలస్యం జరిగే అవకాశం ఉండేది. మాన్యువల్ డేటా విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవడం పొరపాట్లకు దారి తీసేది. బిల్డ్ నౌ ఒక AI ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్‌లో ఉండటంతో ప్రజలకు ఎప్పటికప్పుడు తగిన సహాయాన్ని అందించనున్నది. ఈ ఫీచర్ దరఖాస్తు ప్రక్రియలో వారికి మార్గనిర్దేశం చేయడంతోపాటు చాట్ సపోర్ట్‌తో సమాధానాలు కూడా ఇవ్వనున్నది. ప్రజలకు అవసరమైన సాయాన్ని అందిస్తుంది. ఇందులో రియల్-టైమ్ విశ్లేషణ డేటా కో-పైలట్ ద్వారా జరుగుతుంది. సహజ భాషలో ప్రశ్నలు అడగడం వల్ల అధికారులు సమాచారాన్ని అందుకుంటారు. నిర్ణయం తీసుకోవడంలోనూ, దరఖాస్తు ప్రక్రియలో మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుంది.
3డీలో భవనాలు, లేఅవుట్లు
ప్రతిపాదిత స్థలంలో లేఅవుట్ ఆధారంగా 3డీలో భవన రూపాన్ని చుట్టుపక్కల ఉండే ఇళ్లను కళ్లకు కట్టినట్టు చూపించే ఏఆర్ (అగ్మెంటెడ్ రియాలిటీ) టెక్నాలజీని బిల్డ్ నౌకు జోడించారు. ఈ వినూత్న ఫీచర్ ద్వారా ప్రజలు ప్రతిపాదిత ప్రాజెక్టులను వాస్తవ రూపంలో చూసి అవగాహన పెంపొందించుకోవడానికి వీలుంటుంది. ఇంటరాక్టివ్ 3D మోడళ్ల ద్వారా, నిర్మాణం ప్రారంభం కాకముందే ప్రజలు భవనాల నమూనాలను వీక్షించొచ్చు. ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. టీజీ బీపాస్ లో భవనాల ప్లాన్లను సంప్రదాయ ఫార్మాట్ లో సమీక్షించేవారు. ఇందులో తప్పులు జరగడానికి, అధికారులను ప్రలోభాలకు గురిచేసేందుకు చాలా అవకాశాలు ఉండేవి. ఉదా.. ఒక ఇరుకైన వీధిలో భారీ భవనానికి అనుమతి ఇవ్వొద్దని నిబంధనలు ఉన్నా.. అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేవారు.. కానీ, బిల్డ్ నౌ వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుండటంతో తప్పులకు ఆస్కారం ఉండదు.
పైగా ఏఆర్ టెక్నాలజీ కూడా తోడు కావడంతో తప్పులకు అవకాశం లేదని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. టీజీబీపాస్‌లో ఒక భవన నిర్మాణానికి ప్రభుత్వంతో కాంట్రాక్టర్ ఎలాంటి లావాదేవీలు జరిపారు.. దానికి ప్రభుత్వం ఎలా ఆమోదం తెలిపిందనే విషయాలు ప్రజలకు తెలిసేవికావు. ఉదాహరణకు ఒక భవనం చారిటీ కోసం నిర్మిస్తున్నామని ప్రభుత్వానికి అఫిడవిట్ ఇచ్చి.. అందులో వ్యాపార కాంప్లెక్స్ కడితే ప్రజలకు తెలిసేదికాదు. దీంతో ప్రభుత్వంపై నమ్మకం, జవాబుదారీతనంలో అంతరాలకు దారి తీసే అవకాశం ఉండేది. కానీ, బిల్డ్ నౌ టెక్నాలజీలో పబ్లిక్ బ్లాక్‌చెయిన్ సాంకేతికను ఉపయోగించడం వల్ల నిర్మాణాలకు సంబంధించిన అన్ని చర్యలు, అనుమతులతోపాటు లావాదేవీలు పారదర్శకంగా, ట్రేస్ చేయగలిగేలా ఉంటాయి. దీంతోపాటు ‘బిల్డ్ నౌ’ గురించి అవగాహన కల్పించడానికి, పాత, కొత్త వ్యవస్థలపై సందేహాలు తీర్చడానికి అధికారులు కియోస్కులు ఏర్పాటు చేయనున్నారు. ‘బిల్డ్ నౌ’ గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. పౌరులు ఏం చేయాలి? అధికారులు ఏం చేస్తారు? దరఖాస్తులను ఎలా చేయాలి? ఫైల్ ట్రాకింగ్ ఎలా చేయాలి? అంశాల గురించి ప్రజలకు వివరించనున్నారు.
భౌగోళిక సమాచార వ్యవస్థ
భవన నిర్మాణాల మాస్టర్ ప్లాన్లు, CRMP, SLIP, కమర్షియల్ రోడ్లతో నిబంధనల తనిఖీలుతోపాటు సమ్మతి ధృవీకరణను భౌగోళిక సమాచార వ్యవస్థ ఆటోమేటిక్‌గా నిర్ధారిస్తుంది. ఇది నాన్-హై-రైజ్ భవనాల ప్రక్రియ సమయాలను గణనీయంగా తగ్గిస్తుంది. పైగా ఈ కొత్త సిస్టమ్‌ను రెరాతో అనుసంధానం చేయబడుతుంది. దీనివలన భవన అనుమతులకు సంబంధించిన కచ్చితమైన సమాచారం పౌరులకు అందుబాటులో ఉంటుంది. పనితీరు సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల, ప్రాసెసింగ్ సమయాలలో గణనీయమైన మెరుగుదలను ఈ వ్యవస్థ తీసుకురానున్నది.