- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిండుకుండలా ట్యాంక్ బండ్.. దిగువకు నీటి విడుదల
దిశ, వెబ్ డెస్క్: సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తిరిగి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని అన్ని ప్రధాన దారులు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, అమీర్ పేట, బేగంపేట, ఎస్ ఆర్ నగర్ ఖైరతాబాద్ ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీగా వరద వస్తుండటంతో హుస్సేన్ సాగర్( ట్యాంక్ బండ్) నిండు కుండలా మారిపోయింది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ట్యాంక్ బండ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను అప్రమత్తం చేశారు. హుస్సెన్ సాగర్ నుంచి నీటి విడుదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసుకొవాలని కమిషనర్ బల్దీయా అధికారులకు సూచించారు. కాగా ఎగువన కురిసన వర్షం కారణంగా ట్యాంక్ బండ్‌కు ఇన్ ఫ్లో 1850 క్యూసెక్కులు వస్తుండగా.. 1600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.