- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుద్యోగ భృతిని వెంటనే అకౌంట్లలో వేయాలి.. టీ కాంగ్రెస్
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. హామీని తుంగలో తొక్కారని కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లు మొద్దు నిద్రపోయి ఎన్నికలు రాగానే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిరుద్యోగలకు భరోసా ఇవ్వడానికి బయలు దేరిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు.
తన పాలనలో ఒకే ఒక్క నోటిఫికేషన్ వేసిన కేసీఆర్.. ఆ పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ డబుల్ బెడ్రూం ఇండ్ల గురించి ధర్నాకు దిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు.
9 సం,నిద్ర పోయి ఎన్నిలురాగానే నిద్ర లేచినా సీఎం
— Telangana Congress (@INCTelangana) August 12, 2023
నిరుద్యోగుల భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలిచి వారడిగిన చిన్న కోరిక కు మద్దతు గా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు శనివారం బయలు దేరిన వారిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్… pic.twitter.com/TRRCdGtliq