- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: MLC కవితకు సుప్రీంకోర్టులో షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనకు మరోసారి నోటీసులు పంపిన నేపథ్యంలో తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కవిత అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ముందుగా లిస్ట్ చేసిన ప్రకారమే ఈ నెల 24వ తేదీనే విచారిస్తామని తేల్చి చెప్పింది. మరో వైపు సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున నిన్నటి విచారణకు హాజరుకాలేనని తన న్యాయవాది ద్వారా ఈడీకి కవిత సమాచారం పంపింది. సుప్రీకోర్టులో తన పిటిషన్‌పై విచారణ అనంతరం ఈడీ ఎదుట హాజరు అవుతానని చెప్పింది. అయినప్పటికే ఆ లోపే మార్చి 20న విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగలడంతో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.
Read more:
పరిపాలనపై కేసీఆర్ నెగ్లీజియెన్స్.. సీఎం దృష్టి అంతా ఆ ఒక్క దానిపైనే..!