TS: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ బదిలీ

by GSrikanth |
TS: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ బదిలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఖనిజాభివృద్ధి (మినెరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మల్సూర్‌ను పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను పరిశ్రమల శాఖ (మైన్స్ అండ్ జియాలసీ విభాగం) ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కాకు అప్పగించింది. దీర్ఘకాలంగా ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా ఉన్న మల్సూర్ దానికి ముందు సాగునీటిపారుదల శాఖలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖనిజాభివృద్ధి శాఖకు కొత్త ఎండీని పూర్తి స్థాయిలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడేంత వరకు అదనపు బాధ్యతలను ఎక్కా నిర్వహించనున్నారు.

Advertisement

Next Story