- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. ఎన్నికల శంఖారావం తలపించేలా!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీతో పదేండ్లు కావస్తున్నది. ఈ సారి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నది. వేడుకల నిర్వహణపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు దఫాలుగా ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించారు. ప్రారంభం, ముగింపు కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా జరపాలని సీఎం.. అధికారులను ఆదేశించినట్టు సమాచారం. అయితే రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.
దశాబ్ది వేడుకల పేరుతో ఉత్సవాలు
జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినం. ఈ జూన్ 2తో రాష్ట్రం ఏర్పాటు జరిగి 9 ఏళ్లు పూర్తి చేసుకుని, పదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గ్రామ,మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలో పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా పలు పొగ్రామ్స్ కు డిజైన్ చేస్తున్నారు. ఇంతకాలం ప్రభుత్వం అందించిన సంక్షేమ,అభివృద్ది పథకాలతో లబ్దిపొందిన వారితో పలు కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉన్నారు. అలాగే కవి సమ్మేళనాలు,కల్చరల్ పొగ్రామ్స్, ఫుడ్ పెస్టవల్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఎన్ని రోజుల పాటు చేద్దాం?
అవిర్భావ వేడుకలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం జరగలేదు. ఉత్సవాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలా?వారం రోజులా?పక్షం రోజులా? అనే విషయంపై పలు రకాల అభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. అయితే ఒక్కో రోజు ఒక్కో ప్లాగ్ షిప్ పొగ్రామ్ పై సభలు,సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రధానంగా ధళితబంధు,రైతుబంధు,రైతుభీమా,ఆసరా,పోడు పట్టాల పంపిణీ,గొర్ల పంపిణీ స్కీమ్ పై ప్రచారం కల్పించే తీరుగా పొగ్రామ్స్ తయారు చేస్తున్నట్టు సమాచారం.
కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభ, ముగింపు వేడుకలు
దశాబ్ది ప్రారంభ, ముగింపు వేడుకలను మాత్రం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు పొగ్రామ్స్ కు సీఎం కేసీఆర్ సమక్షంలో జరుగనున్నాయి. అయితే జూన్ న ప్రారంభ వేడుకను సెక్రటేరియట్ అవరణం,ఎల్బీస్టేడియం,ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఎక్కడ నిర్వహించలేదానిపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే ముగింపు వేడుకలను కూడా ఎక్కడ నిర్వహించాలో అధికారులు చర్చిస్తున్నారు.
ఎన్నికల ప్రచారానికి నాంది
రాష్ట్ర అవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతారని చర్చ మొదలైంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని దశాబ్ది వేడుకలకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ పొగ్రామ్స్ కోసం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ,సెక్రటేరియట్ ప్రారంభం పార్టీ పొగ్రామ్‌గా జరిగాయనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర అవిర్భావ వేడుకలు కూడా అదే తీరుగా ఉంటాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read.
ఎన్నికల ఎఫెక్ట్: విదేశీ పర్యటనలకు సిద్ధమైన తెలంగాణ మంత్రులు!