- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురుకుల అభ్యర్థులకు నరకం.. గందరగోళంగా భర్తీ ప్రక్రియ
దిశ , తెలంగాణ బ్యూరో: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టి ట్యూ షన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులకు నరకం చూపిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.కొనగాల మహేష్ విమర్శించారు. ఈ పరీక్షల్లో మొత్తం 2.66 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతుండగా మూడు పేపర్లకు మూడు సెంటర్లను సుమారు 100 కి.మీ దూరంలో వున్నా ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను వేయటాన్ని అయన తప్పు బట్టారు. యూపీఎస్సీకి పరీక్ష విధానంలో అభ్యర్థికోరిన జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థి సూచనమేరకు కేటాయిస్తే.. తెలంగాణలో గురుకులాల అభ్యర్థులు మూడు పేపర్లకోసం మొత్తం తెలంగాణ తిరగవలసిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
ఇలా వర్షాకాలంలో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అభ్యర్థులు పరీక్షలు ఎలా రాయడానికి సాధ్యపడుతుందని , మహిళా అభ్యర్ధులు, గర్భిణీలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం ఒక సవాలుగా మారిందని విమర్శించారు. ఎక్కు వ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాకుండా ఒక లోప భూయిష్టమైన నిర్వహణ విధానంలో పరీక్ష నడుపుతున్నట్టుగా కనబడుతుందని అయన ఆరోపించారు.