- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పాలన కన్నా అధ్వాన్న పరిస్థితి!.. కాంగ్రెస్ సర్కార్ పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: మార్పు కావాలి అని చెప్పి ఏం మార్పు తెచ్చారని, ప్రభుత్వ హాస్టళ్లు ఇంకా అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ హస్టళ్లలో జరుగుతున్న ఘటనలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సాంబారులో ఎలుక!, మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్ధులకు అస్వస్థత అని పలు దిన పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు. దీనిపై ఎంపీ.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కానీ ఏం మార్పు తెచ్చారని ప్రశ్నించారు.
ఆనాటి బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి పురుగుల అన్నం, నీళ్ల చారు లా ఉండేదని, నేడు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వారం రోజులో నాలుగు సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ విషాహారం తిని బలి అవుతున్న విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ అని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.