ఓల్డ్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. Charminar వద్ద భారీ భద్రత

by Satheesh |   ( Updated:2022-08-24 05:31:34.0  )
ఓల్డ్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. Charminar వద్ద భారీ భద్రత
X

దిశ, వెబ్‌డెస్క్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పాతబస్తీలో అర్ధరాత్రి నుండి నిరసనలు కొనసాగుతున్నాయి. ఓ వర్గం వారు రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి నుండి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంతో ఓల్డ్ సిటీ అట్టుడికిపోతుంది. అర్ధరాత్రి యువకులు చార్మినార్ వద్దకు భారీగా చేరుకుని.. పోలీస్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన సౌత్‌జోన్ డీసీపీ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి ఆందోళన చేపట్టిన యువత.. తెల్లవారుజామున మరోసారి ఉదయం చార్మినార్ వద్ద గుమికూడారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏ క్షణం ఏం జరుతుగుతుందో అని స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Advertisement

Next Story