హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సెల్యూట్

by srinivas |
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సెల్యూట్
X

దిశ, సిటీక్రైం : గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క చిన్న యాక్సిడెంట్ జరగకుండా ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీసు విభాగాల అధికారులు నిర్వహించిన డ్యూటీకి హైదరాబాద్ గ్రేటర్ ప్రజలు సెల్యూట్ అంటున్నారు. తనిఖీల సమయంలో మందుబాబులు ప్రదర్శించిన రుబాబు, బూతులతో విరుచుకుపడ్డ తీరు, మద్యం మత్తులో పోలీసులకు ఇచ్చిన ధమ్కీలను పరిశీలిస్తే ఎవరీకైనా కోపం రావాల్సిందే కాని మన పోలీసులు మాత్రం చాలా ఓర్పు, సహనం, శాంతితో వారి మాటలను పట్టించుకోకుండా విధులను నిర్వహించి డిసెంబర్ 31 రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విధులను నిర్వహించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇలా పోలీసులు నిర్వహించిన డ్యూటీ, మందుబాబుల హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వాటిని చూసిన జనం నూతన సంవత్సరం రోజు రోడ్డు ప్రమాదాల చోటు చేసుకోకుండా పోలీసులు చెక్ పెట్టారని ప్రశంసల వర్షం కురిపించారు.

ట్రాఫిక్ పోలీసులపై రుబాబు చేసిన సంఘటనలు..

1. నా బండి ఎందుకు తీసుకుపోతున్నారు.. విడియో తీసి ఏం చేస్తారు.. నన్ను టచ్ చేయలేరు. మీరేం పీ..రా అంటూ ఓ యువకుడు నాంపల్లి ప్రాంతంలో హాల్‌చల్ చేశాడు.

2. జిందగీలో నీవు ఎప్పుడు మందు తాగలేదా.. అయితే శభాష్.. రోడ్డు మీద చాలా మంది మద్యం సేవించి వెళ్తున్నారు. నన్ను ఒకడిని ఎందుకు పట్టుకున్నారంటూ రాజేంద్రనగర్ ప్రాంతంలో ఓ మందుబాబు చిందేశాడు. మీరు ఇప్పుడు పట్టుకున్నారు కదా మీరు ఎంతైనా చలాన్ వేయండి, ఏడాది జైలు వేయండి అయినా నేను రూల్స్ పాటించను.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ మొఖం మీద చేతి వేళ్లు ఎత్తిచూపిస్తూ నానా యాగీ చేశాడు.

3. నేను బండి నడప లేదు.. నడుచుకుంటు వస్తున్నా.. బండి పార్క్ చేస్తున్నా.. వచ్చి మీరు పట్టుకున్నారంటూ మరో మందుబాబు వీరంగం చేశాడు.

4. ఈ రోడ్డు ఏమైనా మీ జాగీరా.. మీరు బండి ఆపిన తర్వాత నాకు ఎందుకు తనిఖీలు చేస్తున్నారు. నాకు రూ.5 వేలు ఫైన్ వేయండి.. కానీ నేను పార్క్ చేసిన తర్వాత ఎందుకు తనిఖీ చేస్తున్నారు రా.. అంటూ భూతులు తిట్టారు.

5. మహిళలు ఉన్నారని చూడకుండా ఎలా ఆపుతారు. ఏం డ్యూటీ చేస్తున్నారు, మీరంటూ మద్యం సేవించి వాహనం నడుపుతూ వస్తున్న వ్యక్తితో కలిసి వస్తున్న మహిళలు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసులపై చిందేసినా.. డ్యూటీ..

వారంతా డ్యూటీ చేసింది మందుబాబులు ప్రమాదాల బారినపడకుండా ఇంటికి క్షేమంగా చేరుకోవడానికేనని గుర్తించుకోవాలని నెటిజన్‌లతో నగర ప్రజలు కూడా పోలీసులకు కితాబు ఇచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు సిబ్బంది నిర్వహించిన డ్యూటీతో యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్‌గా నమోదు కావడంతో పోలీసు బాస్‌లు వారికి అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed