- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గడువు తేదీ పెంపు..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గడువును పొడిగిన్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కాలర్ షిప్ ల దరఖాస్తు, రెన్యూవల్ కోసం http://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గతంలో సెప్టెంబర్ 1నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఉన్న గడువు ముగిసిందని తెలిపారు.దీంతో విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గడువు తేదిని, 2024-25 విద్యా సంవత్సరానికి గాను, మార్చి31, 2025 వరకు పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు, 7,44,060 మంది విద్యార్థులకు గాను 4,08,171 మంది విద్యార్థులు మాత్రమే రెన్యూవల్ కోసం ఈ పాస్ వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. 4,83,254 తాజా దరఖాస్తులకుగాను, 1,39,044 మంది విద్యార్థులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఏజీఆర్ఐసీఈటీ, పాలిసెట్, ఫార్మసీ, ఎడ్ సెట్, ఎన్ ఏటీఏ, పీజీఈసీఈటీ, సీపీజీఈటీ, డైట్ సెట్, ఐవీసీ, కెఎల్ఎన్ ఆర్, లాసెట్, ఎస్ డబ్ల్యూ 2 కన్వీనర్ లు విద్యార్థుల తాజా నమోదుకు అవసరమైన కౌన్సెలింగ్ డేటాను ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. దీంతో విద్యార్థుల కోసం గడువు పెంచినట్టు విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తి రిజిష్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు సైతం తమ వివరాలను ఈ పాస్ వెబ్ సైట్ లో గడువులోగా అప్ లోడ్ చేసుకోవాలన్నారు.