- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్...సింగరేణి స్థలంలో అక్రమ కట్టడాన్ని అడ్డుకున్న సిబ్బంది
దిశ, కొత్తగూడెం : సింగరేణి స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఇటీవల దిశ పత్రికలో కథనం వెలువడింది. దీంతో సింగరేణి ఎస్ఎన్పీసీ, ఎస్టేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి బాబు క్యాంపు లోని శివాలయం పక్క వీధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెనుక రాత్రి సమయంలో లోపల నుంచి తాళాలు వేసుకొని రహస్యంగా రాత్రంతా గదులలో అక్రమ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టేట్ సిబ్బంది, ఎస్ఎన్ పీసీ సిబ్బంది స్థలం దగ్గరికి చేరుకొని పనులను నిలిపివేశారు.
లోపల అత్యాధునిక వసతులతో సీలింగ్, అటాచ్డ్ బాత్రూం , విలువైన టైల్స్ తో అక్రమంగా డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాన్ని చూసి సింగరేణి సిబ్బంది అవాక్కయ్యారు. అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న వ్యక్తి ఇప్పటికే మరో రెండు సింగరేణి క్వార్టర్లను ఆక్రమించి ఆ స్థలంలో భవనాలను నిర్మించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సదరు అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేసేందుకు సింగరేణి అధికారులు యత్నిస్తున్నట్లు సమాచారం.