- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
దిశ, ఇంద్రవెల్లి : ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడే తమ పార్టీ నాయకులపైన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మార్గ మధ్యలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, స్థానిక నాయకులతో కలిసి ఆదివాసీ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరులు ఏదైతే భూమి కోసం పోరాటం చేశారో కేసీఆర్ నాలుగున్నర లక్షల ఎకరాలకు భూమి హక్కులు కల్పించినట్టు తెలిపారు.
కేసీఆర్ హయాంలో వీరులందరినీ గౌరవించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎవరైనా గొంతు ఎత్తి రైతుల పక్షాన మాట్లాడితే వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కేటీఆర్ మీద కూడా రకరకాల కేసులు పెట్టి కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారుతి పటేల్ సుపియన్, అంజద్, జిలానీ పుర్క బాపూరావ్, పుష్పాణి ,భీంరావ్ పాల్గొన్నారు.