- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Asaduddin Owaisi: ఇంకా ఎంతమంది నేతలు జైలుకు వెళ్తారో తెలియదు
దిశ, చార్మినార్: పాతబస్తీ నెహ్రూ జూపార్క్ టు ఆరాంఘర్ఫ్లైఓవర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో పాటు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ఒవైసీ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి జైలులో ఉన్నప్పుడు వంట మనిషితో ఫొటో తీసుకున్నారని మీడియా వాళ్లు నాతో అన్నారని, రేవంత్‌రెడ్డి కమిట్ మెంట్‌తో పనిచేసే వ్యక్తి అని, ఆయన ఎవ్వరినీ మర్చిపోరు అన్నారు. అసలు రేవంత్‌రెడ్డి లాగానే ఉండాలని, రాజకీయ నేతలు జైలుకు వెళ్ళడం సహజమని, అసలు చాలామంది నేతలు ఇంకా జైలుకు వెళ్ళలేదని, జైలుకు వెళ్తే కూడా అసలు ఏంటన్నది తెలుస్తుందని అన్నారు. ఇందులో డబుల్మీనింగ్డైలాగ్ఏమీ లేదని ఫన్నీగా చెప్పారు. తాను కూడా 1998లో జైలుకు వెళ్ళానని చంద్రబాబు తన బంధువని 50 రోజులు జైలు జీవితం గడిపానన్నారు. జైలులో ఉన్న సమయంలో పరిచయమయిన వ్యక్తులను ఎప్పటికీ మరిపోలేరన్నారు.
ప్రతి ఒక్క రాజకీయ నేతకు జైలుకు వెళ్ళాల్సివస్తుందన్నారు. ఎంత గొప్ప నేతలైనా జైలుకు పోవాల్సి వస్తుందని, అప్పుడే జైలు బాధలు ఏంటో అర్థమవుతుందన్నారు. ఇంకా ఎంతమంది జైలుకు వెళ్తారో తెలిదయని అసదుద్దీన్చమత్కరించి మాట్లాడారు. చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని తిలకించడానికి దేశ, విదేశాల నుంచి 25 వేల నుంచి 30 వేల మంది సందర్శకులు అనునిత్యం వస్తున్నారన్నారు. మీరాలం మండి నుంచి చార్మినార్‌వరకు స్కైవాక్ఏర్పాటు చేస్తే సందర్శకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఫలక్‌నుమా నుంచి జూబ్లీ బస్టాండ్వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు 2028 ఎన్నికల నాటికి పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పనులు పూర్తయిన వెంటనే రేవంత్‌రెడ్డి జూబ్లీ బస్టాండ్‌వద్ద మెట్రోలో ఎక్కి ఫలక్‌నుమాలో దిగుతారని అసదుద్దీన్ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రేషన్‌కార్డుల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. అయితే జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడానికి సీఎం ఇప్పటికే ప్రకటించడం సంతోషకరమని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుపేదల తరపున రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
లాల్‌దర్వాజా ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించండి: అక్బరుద్దీన్ ఓవైసీ
అంతకు ముందు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పాతబస్తీ అభివృద్ధి కోసం కులమతాలకు అతీతంగా మజ్లిస్నిరంతరం కృషిచేస్తుందన్నారు. చారిత్రాత్మక లాల్‌దర్వాజా మహంకాళి అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.20కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ జీవో కూడా జారీ అయిందని, నేటికీ నిధులకు మోక్షం కలుగలేదని గుర్తుచేశారు. వెంటనే ఆలయ అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కోరారు. పాతనగరంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మజ్లిస్‌పార్టీ విన్నపం మేరకు వెంటనే రూ.351 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ పరిధిలోకి మసీదులు, దర్గాలతో పాటు, గురుద్వార్, చర్చీలను కూడా చేర్చి అభివృద్ధి చేయాలని అక్బరుద్దీన్ప్రతిపాదించారు.
టూరిజం పాలసీ గురించి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరుగలేదని, ఆ సమయంలో తాను మాట్లాడలేకపోయానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ఓవైసీ, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ఓవైసీ, మొహమ్మద్ముబీన్, మీర్జుల్ఫీకర్ అలీ, జాపర్హుస్సేన్మెరాజ్, ఎమ్మెల్సీలు ఎం.ఎస్ప్రభాకర్, బల్మూరి వెంకట్, మీర్జా రహమత్‌బేగ్, ఎగ్గే మల్లేషం, అమీర్‌అలీఖాన్, బొగ్గారపు దయానంద్‌గుప్త, టీయూఎఫ్ ఐడీసీ చైర్మన్చల్లా నర్సింహారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్గద్వాల్విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్శ్రీలత, మాజీ మేయర్బాబాఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read..
Owaisi: రోశయ్య, కిరణ్ కుమార్, వైఎస్ఆర్ వేరు.. రేవంత్ రెడ్డి వేరు