- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫైర్ డ్రైవర్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
దిశ, గండిపేట్ : పోలీసు శాఖతో సమానంగా అగ్నిమాపక సిబ్బంది బాధ్యతలు కలిగి ఉంటారని, వారు బాధ్యతయుతంగా పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం గండిపేట్ మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ డైరెక్టర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ మినిస్టర్ దుదిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 196 మంది ఫైర్ సిబ్బంది డ్రైవర్స్, ఆపరేటర్స్ కు మొదటి బ్యాచ్ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు.
ఫైర్ సర్వీస్‌కు సంబంధించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్, హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్త, డీజీ నాగి రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, కౌన్సిలర్ రేఖ యాదగిరి, చైర్మన్ కోట వేణు గౌడ్, చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, ఫైర్ సర్వీస్ ఉద్యోగులు, ఫైర్ సర్వీస్ ఉద్యోగులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.