ఈద్గాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు

by Naveena |
ఈద్గాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సోమవారం నిర్వహించనున్న రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ధ భద్రతా ఏర్పాట్లను పకడ్బంధీగా అమలు చేస్తున్నామని జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ డి.జానకి తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఆమె పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసి మాట్లాడారు. పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారని,ప్రజలు ఆందోళనలకు గురికావద్ధని తెలిపారు. ముఖ్యంగా పండుగ సందర్భంగా నమాజులు నిర్వహించే ఈద్గాల వద్ధ అదనపు పోలీస్ బలగాలు మోహరించామని తెలిపారు. ట్రాఫిక్ కట్టడి,హంగామా లేని పండుగను జరుపుకునేందుకు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. సీసీ టీవి కెమోరాలతో పర్యవేక్షణ,క్యూఆర్టీ(క్విక్ రియాక్షన్ టీమ్స్),మున్సిపల్,రెవెన్యూ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూంను సంప్రదించాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి ముస్లీం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story