ఊహించని కాంబోలో సినిమా ఫిక్స్.. మాస్టర్ పీస్ రాబోతుందంటూ హైప్ పెంచేస్తున్న మేకర్స్

by Hamsa |   ( Updated:2025-03-30 15:15:49.0  )
ఊహించని కాంబోలో సినిమా ఫిక్స్.. మాస్టర్ పీస్ రాబోతుందంటూ హైప్ పెంచేస్తున్న మేకర్స్
X

దిశ, సినిమా: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh), మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi ) హైలీ యాంటిసిపేటెడ్ మూవీ మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని అందించబోతోంది. యూనిక్ స్టొరీ, గ్రిప్పింగ్ కథనంతో పూరి జగన్నాథ్ తనదైన శైలిలో తెరకెక్కించనున్న ఈ చిత్రం, విజయ్ సేతుపతి చరిస్మాటిక్ ప్రజెన్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది. పూరి జగన్నాధ్, చార్మి కౌర్(Charmi Kaur), పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని ఘనంగా నిర్మించనున్నారు. ఈరోజు, తెలుగువారి ప్రత్యేకమైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ పవర్ ఫుల్ కథని రాశారు.

ఇందులో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్‌లో చూడబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ పాన్-ఇండియా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది చూసిన వారంతా ఈ కాంబో అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా నువ్వు ఇచ్చే కమ్‌బ్యాక్ బాక్సాఫీసు షేక్ అయ్యేలా ఉండాలని పూరి జగన్నాథ్ పేరును వైరల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed