TVJA: వీడియో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం.. ముఖ్య అతిథిగా మీడియా అకాడమీ చైర్మన్

by Ramesh Goud |   ( Updated:2025-01-04 16:27:02.0  )
TVJA: వీడియో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం.. ముఖ్య అతిథిగా మీడియా అకాడమీ చైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: వీడియో జర్నలిస్టులకు(Video Journalists) వృత్తి పరమైన ప్రత్యేకమైన శిక్షణ తరగతులు(Coaching Classes) నిర్వహించి సర్టిఫికెట్లు(Certificates) అందజేయాలని వీడియో జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి(Telangana Media Acadamy Chairman Srinivasa Reddy)ని కోరారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్(Bhasheer Bhag press Club) లో వీడియో జర్నలిస్టుల ప్రెసిడెంట్ వనం నాగరాజు ప్రధాన కార్యదర్శి నండూరి హరీష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీడియో జర్నలిస్ట్‌లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను మీడియా అకాడమీ చైర్మన్‌కి వివరించారు. ముఖ్యంగా హెల్త్ కార్డులు విషయమై హైదరాబాద్ సహా జిల్లాల నుంచి వీడియో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. అక్రిడేషన్ కమిటీ అసెంబ్లీ కమిటీల్లో వీడియో జర్నలిస్టుల ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలు విషయంపై సుదీర్ఘంగా వివరించారు.

అంతేగాక ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రఫీ డే లానే వీడియోగ్రఫీ డే నిర్వహించాలని కోరారు. ఇక ఫీల్డ్ లో ప్రతిరోజూ వర్కింగ్ వీడియో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీనివాస్ రెడ్డి ముందుంచారు. అలాగే మీడియా అకాడమీకి సంబంధించి ఏర్పడే గవర్నింగ్ బాడీ కౌన్సిల్‌లో వీడియో జర్నలిస్టులకు ప్రాతినిథ్యం కల్పించాలని విన్నవించారు. ఇళ్ల స్థలాలు విషయంలో వీడియో జర్నలిస్టులకు మొదట ప్రాధాన్యత కల్పించి ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని కోరారు. ఉద్యోగం కోల్పోయిన వీడియో జర్నలిస్ట్‌లు, చాలీచాలని జీతంతో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులకు సబ్సిడీతో కూడిన కెమెరా ఎక్విప్మెంట్ ఇప్పించి, వారి ఎదుగుదలను సహాయ పడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ఛానల్స్ కు సంబంధించిన సీనియర్ వీడియో జర్నలిస్టులతో పాటు టీవీజేఏ(TVJA) వ్యవస్థాపకులో ఒకరైన నిరంజన్ తో పాటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కె రాములు, హెచ్‌యూజే(HUJ President) శంకర్ గౌడ్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి, టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్ ,చిన్న పత్రిక సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు, అసోసియేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ v.రాజు, ట్రెజరర్ రాజు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Next Story