AP News : ఈనెల 17న ఏపీ మంత్రివర్గ సమావేశం

by M.Rajitha |   ( Updated:2025-01-06 16:20:27.0  )
AP News : ఈనెల 17న ఏపీ మంత్రివర్గ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 17న మరోసారి ఏపీ మంత్రివర్గ సమావేశం(AP Cabinet Meeting) జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ఏపీప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో తమ ప్రతిపాదనలను జనవరి 16వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో ప్రధానంగా గీత కార్మికుల కులాలకు మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరలపై చర్చించనున్నట్లు సమాచారం. జనవరి 18న చంద్రబాబు దావోస్(Davos) పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. కాగా దావోస్ పర్యటన గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా జనవరి రెండో తేదీన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.


Also Read..

Minister Narayana:రెండు రోజుల్లో భ‌వ‌న నిర్మాణాల‌కు కొత్త రూల్స్ జారీ చేస్తాం!

Advertisement

Next Story