శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. భారీగా గేట్లు ఎత్తివేత

by Mahesh |
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. భారీగా గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణగా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆ డ్యామ్ నుంచి దాదాపు 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరిగిపోయింది. దీంతో బుధవారం ఉదయం మూడు గేట్లను ఎత్తిన అధికారులు గురువారం తెల్లవారుజామున మరో నాలుగు గేట్లను ఎత్తారు. మొత్తం 7 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 2,62,462 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,65,233 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. అలాగే డ్యా్మ్ కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story