Breaking News: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి.. వచ్చే నెల నుంచే మరో హామీ

by Ramesh Goud |   ( Updated:2024-01-23 10:17:21.0  )
Breaking News: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి.. వచ్చే నెల నుంచే మరో హామీ
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తొంది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం మరో గ్యారెంటీ అమలుకు సిద్దం అయినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్ హామీ అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తొంది.

వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని అన్నారు. ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గుల్ల అయ్యిందని ఫైర్ అయ్యారు. అందుకే హామీల అమలులో జాప్యం నడుస్తొందని అన్న కోమటిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అని విమర్శించారు.

Advertisement

Next Story