Medicare : కేటీఆర్ ఆరోపణలను ఖండించిన మెడికవర్ యాజమాన్యం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-13 13:29:39.0  )
Medicare : కేటీఆర్ ఆరోపణలను ఖండించిన మెడికవర్ యాజమాన్యం
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)తమ అసుపత్రిపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని మెడికవర్ యాజమాన్యం స్పష్టం చేసింది. మెడికవర్(Medicare)ను ప్రారంభించిందే మాజీ సీఎం కేసీఆర్ అని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లతో ఇంటరాక్ట్ అవుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రులు ఈటల, హరీష్ రావులతోనూ మా ఆసుపత్రులు ప్రారంభించామని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో, ఏ రాజకీయ పార్టీతో 'మెడికవర్'కు సంబంధం లేదన్నారు. అధికార పక్ష నేతయినా, ప్రతిపక్ష నేతయినా.. పేషెంట్ విషయంలో సాయం కోరితే చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా రాజకీయపరమైన విషయాల్లో మా జోక్యం ఉండదన్నారు. మా డాక్టర్ శరత్ సీఎం రేవంత్ రెడ్డికి 2007నుంచి వ్యక్తిగత వైద్యులని, ఆ సాన్నిహిత్యంతో వరంగల్ లో మేం సీఎంతో మా ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. అంతకుముందు కేటీఆర్ లగచర్ల ఫార్మా కంపనీ వివాదంపై మీడియాతో మాట్లాడిన సందర్భంతో మెడికవర్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

రేవంత్ రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారని, అన్నం శరత్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడని, ఆయన మెడికవర్ హాస్పిటల్ ఓనర్ అని ఆరోపించారు. శరత్ అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఇద్దరు ఒకే సంస్థలో డైరెక్టర్లని, వాళ్లిద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. బెంగళూరులోనూ మెడికవర్ హాస్పిటల్‌ను అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed