Telangana: అద్దె తీసుకోవడం బరాబర్.. కారు మాత్రం బయటకి తీసేది లేదు..

by Disha Web Desk 3 |
Telangana: అద్దె తీసుకోవడం బరాబర్.. కారు మాత్రం బయటకి తీసేది లేదు..
X

దిశ నల్లగొండ బ్యూరో: నెలనెలా జీతాలు తీసుకుంటాం.. కానీ పని మాత్రం చేయలేము అంటున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ముఖ్యంగా డిఆర్డిఏ శాఖ నిత్యం ఎదో ఒక చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. తాజాగా నల్లగొండ జిల్లా డిఆర్డిఎలో విధులు నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది.

అద్దె తీసుకోవడం బరాబర్.. కానీ ఇన్స్పెక్షన్ కి మాత్రం వెళ్ళను అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా డిఆర్డిఎ ఉన్నత స్థాయి అధికారి ఫీల్డ్ పర్యవేక్షణ చేయడానికి ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారుకు ప్రభుత్వమే ప్రతి నెల రూ 33 వేలు అద్దె చెల్లిస్తుంది. అయినా అధికారి తాను ఉపయోగించే వాహనాన్ని తన కార్యాలయ ప్రాంగణంలో ఉన్న షెడ్డులో భద్రంగా దాచిపెట్టి, ఇతరుల వాహనాలను ఉపయోగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

కాగా ప్రభుత్వ పనులకు ఉపయోగించాల్సిన వాహనాన్ని, తన సొంత పనులకు మాత్రమే వినియోగిస్తూ మిగతా సందర్భాల్లో తన తోటి ఉద్యోగుల వాహనాలను వినియోగిస్తుంటారని సమాచారం. అయితే ఈ వాహనం తనకు దగ్గరగా కావాల్సిన వాళ్ళదని తెలుస్తోంది. దీనితో శాఖలో ఉన్నతాధికారి కాబట్టి ఎవరు కూడా తనను ప్రశ్నించరనే ధీమాతో ఆయన ఆ వాహనాన్ని విధినిమిత్తం వినియోగించకుండా.. సొంతపనులు వినియోగిస్తున్నారని సమాచారం.

కాగా ఆ వాహనం పూర్తిగా దుమ్ముపట్టి ఉంది. ఒకవేళ నిజంగా రెగ్యులర్గా వాడుంటే వాహనంపై అంత దుమ్ము ధూళి ఉండేది కాదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాహనం ఉపయోగించకుండా ప్రతినెల బిల్లులు తీసుకునే అధికారులపై విచారణ చేసి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు



Next Story

Most Viewed