- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
10 ఏళ్లుగా పనిచేస్తున్న జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలి
దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనాన్స్, ఉన్నత విద్యా శాఖలు 1,654 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని అనుమతి ఇచ్చినప్పటికీ కుట్ర పూరితంగా తమ స్థానంలో కొత్తవారిని నియమించుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అద్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం కుట్ర పూరితంగానే, కక్షా ధోరణితోనే సాగుతోందని అన్నారు. గత 10 ఏండ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను కాదని, జోనల్ స్థాయి పోస్టులకు సంబంధం లేని జిల్లా కలెక్టర్ కమిటీగా పాత గైడ్ లైన్స్ కు కక్షాపూరితంగా కొన్ని యాడ్ చేసి విడుదల చేయడం జరిగిందని వారు ఆరోపించారు.
గెస్ట్ లెక్చరర్ల పై కుట్ర సాధింపు చర్యలకు అడుగేస్తున్న ఇంటర్ కమిషనర్ నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారు. తక్షణమే పాత గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చొరవ తీసుకుని గెస్ట్ లెక్చరర్లకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
- Tags
- guest lecturers