- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Ponnam : సెట్విన్ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది
దిశ, చార్మినార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ (Setwin ) ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ( Minister Ponnam )ప్రభాకర్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన వసతులతో రూపొందించిన సంస్థ చైర్మన్ కార్యాలయాన్ని చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి పురోగతి ఇతర అంశాలను చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి ( (Chairman N. Giridhar Reddy ) , మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్ ( Managing Director K. Venugopal ) మాట్లాడుతూ… సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ, ట్రాన్స్ పోర్ట్, ట్రేడింగ్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చే విధంగా తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందని అన్నారు. నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.
జంట నగరాల్లోని నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 1978 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఒక మంచి ఆశయంతో సెట్విన్ సంస్థను స్థాపించడం జరిగిందని అన్నారు. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. 'ముఖ్యంగా జంట నగరాలతో పాటు సెట్విన్ మినీ బస్సు సర్వీసులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే కార్యక్రమానికి తన శాఖ పరంగా అన్ని విధాలుగా సహకారం ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ ఈ ఆటో సేవలను సెట్విన్ ద్వారా అందించడంతో పాటు మహిళకు ఉపాధి అవకాశాలను కల్పనకు సహకరిస్తానని అన్నారు.
అనంతరం సెట్విన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ కేవలం జంట నగరాలకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు త్వరలోనే జహీరాబాద్, జడ్చెర్ల, హుస్నాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాలలో సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్న ట్లు చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాలలో 50 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ప్రతి ఏటా కనీసం 25 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో మేము పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ సురేష్ బాబు, మేనేజర్ అబ్దుల్ మొయిజ్, సెట్విన్ సిబ్బంది పాల్గొన్నారు.