వీఆర్వోలు మళ్లీ రాబోతున్నారా..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-02 09:41:11.0  )
వీఆర్వోలు మళ్లీ రాబోతున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి వీఆర్వోలను మళ్ళీ నియమించబోతోంది. అయితే ఈ వీఆర్వోలను ఇపుడు జేఆర్వో(జూనియర్ రెవెన్యూ ఆఫీసర్)లుగా పేరు మార్పు చేయనున్నట్టు సమాచారం. 2020 అక్టోబర్‌కు ముందు రాష్ట్రంలో దాదాపు 25,750 వీఆర్వో, రెవెన్యూ సహాయకులు ఉండేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి, అప్పటికే విధుల్లో ఉన్నవాళ్లను వివిధ శాఖల్లోకి అడ్జస్ట్ చేసింది. అయితే గ్రామ స్థాయిలో చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రభుత్వ దృష్టికి రావడంతో తిరిగి వీరందరిని వీఆర్వోలుగా నియమించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 10,954 గ్రామ పంచాయితీలు ఉండగా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఈ పోస్టుల్లోకి తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పుడు తీవ్ర పనిభారం మోస్తున్న పంచాయతీ సెక్రెటరీలకు కాస్త ఉపశమనం లభించినట్టు కూడా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed