- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆధార్ కార్డ్ అప్డేట్ విషయంలో షరతులు విధించిన ప్రభుత్వం!
దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ కార్డ్ ప్రతిఒక్కిరికి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఇండియాలోని ప్రజలందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ పథకాలకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ తప్పనిసరి అవసరం. ముఖ్యమైన డాక్యుమెంట్‌లో తప్పులు ఉంటే చేసుకోవడం అనేది తప్పనిసరి. అయితే ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, అడ్రస్, జెండర్ లాంటి వాటిలో తప్పులు ఉన్నట్లైతే.. ఆధార్ కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలి. అయితే ఆధార్ కార్డ్‌లోని డేట్ ఆఫ్ బర్త్, జెండర్‌ను మాత్రం ఒకసారి మాత్రమే మార్చకోవాలని తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని పరిమితులు, షరతులను విధించింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎక్కువ సార్లు మార్చుకోవడానికి వీలు లేదు. ఆధార్ కార్డ్ హోల్డర్ తన జీవిత కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది. పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకోవాలి. జెండర్ మార్చు కోవాలంటే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ పరిమితికి మించి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టాలి. అలాగే ఆధార్ కార్డు సమస్యల పరిష్కారం కోసం UIDAI.. 1947 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో తీసుకొచ్చింది. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు. ఉర్దూ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, మరాఠీ మొత్తం 12 భాషల్లో UIDAI ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. ఈ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అదేవిధంగా ఆదివారం రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.