- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jawahar Navodaya: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష.. దరఖాస్తు గడువు నవంబర్ 26 వరకు పొడగింపు..!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ జవహర్ నవోదయ(Jawahar Navodaya) పాఠశాల్లోని 9,11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడగించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(Central Department of Human Resource Development) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ పరీక్షకు సంబధించి అప్లికేషన్ గడువు తేదీ నిన్నటితో ముగియగా తాజాగా దాన్ని ఈ నెల 26 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వివరాలను తప్పుగా నమోదు చేస్తే ఈ నెల 27, 28 తేదీల్లో ఎడిట్(Edit) చేసుకోవచ్చని తెలిపింది. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్(Free Education)తో పాటు, బాల బాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి(Hostel Accommodation), ఫుడ్(Food) సౌకర్యాలు కల్పిస్తారు. కాగా దేశవ్యాప్తంగా 650 నవోదయ స్కూల్స్ ఉండగా అందులో తెలంగాణా(TG)లో 9, ఆంధ్రప్రదేశ్(AP)లో 15 పాఠశాలలు ఉన్నాయి.