‘Patnam Narender Reddy ఏమైనా టెర్రరిస్టా..?’ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

by karthikeya |   ( Updated:2024-11-20 07:26:27.0  )
‘Patnam Narender Reddy ఏమైనా టెర్రరిస్టా..?’ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల ఘటనతో సంబంధం ఉందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తన అరెస్ట్‌ను తప్పుబడుతూ తనపై పెట్టిన కేసులను క్వాష్ చేయాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. సదరు పిటిషన్‌పై ఈ రోజు (బుధవారం) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. కాల్స్ చేసినందుకు అరెస్ట్ చేయడం సరికాదని, కనీసం అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలిపారు. సుప్రీం తీర్పులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడకుండానే నరేందర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని న్యాయవాది తెలిపారు. అలాగే కోర్టును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, నచ్చింది రాసుకుని కన్ఫెషన్ రిపోర్టుగా చూపిస్తున్నారని వాదించారు.

ఈ క్రమంలోనే కోర్టు కూడా పోలీసులకు కీలక ప్రశ్నలు సంధించింది. లగచర్ల ఘటన జరిగిన రోజు సురేష్‌తో నరేంద్ర ఎన్నిసార్లు ఫోన్‌లో మాట్లాడారా?, ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా..? ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటి..? పార్క్‌లో వాకింగ్ చేస్తున్న నరేందర్‌ను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారు? అతడు ఏమైనా టెర్రరిస్టా..? అరి ఘాటుగా మండిపడింది.

కోర్టు ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా బలంగా వాదనలు వినిపించారు. ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి లేకున్నా నిందితులకు ఆయనే డబ్బు సమకూర్చారని, దాడికి పాల్పడ్డ నిందితులకు ఆయన సాయం అందించారని, దాడికి పరోక్షంగా ప్రేరేపించారని వాదించారు. అలాగే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని, ఆయన ఇంటి ముందు అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed