ఆటో రిక్షాలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

by Anjali |   ( Updated:2024-01-09 09:47:48.0  )
ఆటో రిక్షాలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
X

దిశ, ఫీచర్స్: ఆటో రిక్షా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గిస్తూ ఆటో రిక్షాలకు భారీ ఊరట కలిగించింది. ఈ నిర్ణయం ప్రకారం డీజిల్‌ లేదా గ్యాస్‌తో నడిచే ఆటోలపై వసూలు చేసే థర్డ్‌ పార్టీ ప్రీమియం ఒక్కో వాహనంపై రూ.2,371, ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,134 మించకూడదని స్పష్టం చేసింది. ఆరుగురు కంటే తక్కువ మంది ప్రయాణించే ఆటో రిక్షాలకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది.

2022లో జారీ చేసిన నిబంధనల ప్రకారం డీజిల్‌ లేదా గ్యాస్‌తో నడిచే ఆటో రిక్షాలు థర్డ్‌ పార్టీ ప్రీమియం కింద ఒక్కో ఆటోపై రూ.2,539, ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,214 చెల్లించాలి. అదే ఈ-ఆటోలైతే ఒక్కో వాహనంపై రూ.1,648, ఒక్కో ప్రయాణికుడిపై రూ.789 థర్డ్‌ పార్టీ ప్రీమియంగా చెల్లించాల్సి వచ్చేది. దీంతో వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయని, కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed