- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో మంటలు.. అదుపు చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు
by Anjali |

X
దిశ, బేగంపేట: శంషాబాద్ నుండి, జేబీఎస్ వెళుతున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఉదయం బేగంపేట ప్రకాష్ నగర్ ఎయిర్ పోర్ట్ ఎదురుగా ప్రధాన రహదారిపై ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బస్ డ్రైవర్ అప్రమత్తంతో బస్సు రోడ్డు పైన నిలిపివేసి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సికింద్రాబాద్ అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను వెంటనే ఆర్పేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story