Bill Payment: నల్లా బిల్లు వన్ టైం సెటిల్‌మెంట్ తుది గడువుపై సర్కార్ కీలక నిర్ణయం

by karthikeya |   ( Updated:2024-11-02 13:54:39.0  )
Bill Payment: నల్లా బిల్లు వన్ టైం సెటిల్‌మెంట్ తుది గడువుపై సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లా బిల్లు వన్‌టైం సెటిల్‌మెంట్‌ గడువు తేదీని పొడిగించాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తెలంగాణ (Telangana) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపుల ఆఖరి తేదీని నవంబర్ 30 వరకు పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూవేజ్ బోర్డ్ (HMWSSB) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ రోజు (శనివారం) ప్రకటించింది.

కాగా.. హైదరాబాద్ (Hyderabad) వాటర్ బోర్డు జారీ చేసిన వివరాల ప్రకారం.. వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్ వల్ల అక్బోర్ 31 వరకు దాదాపు రూ.49 కోట్ల మేర బిల్లులు వసూలయ్యాయని, 70,335 మంది ఈ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకుని చెల్లింపులు చేశారని వెల్లడించింది.

ఇదిలా ఉంటే నగరంలో పేరుకుపోతున్న నల్లా బిల్లులను వసూలు చేసేందుకు వాటర్ డిపార్ట్‌మెంట్ ఈ వన్ టైం సెటిల్‌మెంట్-2024 స్కీమ్‌ (OTS-2024)ను తీసుకొచ్చింది. దీని ఎలాంటి లేట్ ఫీజ్, వడ్డీలు లేకుండానే వాటర్ బిల్లులను చెల్లించే అవకాశాన్ని ప్రజలకు కల్పించింది. దీంతో ప్రజలు కూడా ఈ స్కీమ్‌ను వినియోగించుకుని పెద్ద సంఖ్యలో చెల్లింపులు చేశారు.

Advertisement

Next Story